నేను ఇజ్రాయెల్‌లో అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చు: ట్రంప్ సరదా వ్యాఖ్య

  • తనకు ఇజ్రాయెల్‌లో 99 శాతం ప్రజాదరణ ఉందని వెల్లడి
  • నెతన్యాహూ చాలా మంచివారని కితాబు
  • ఇరాన్‌తో ఒప్పందానికి తొందరలేదన్న ట్రంప్
అమెరికాలో తన అధ్యక్ష పదవీకాలం ముగిసిన అనంతరం ఇజ్రాయెల్‌లో కూడా ప్రధాని పదవికి పోటీ చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదాగా అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఇజ్రాయెల్‌లో 99 శాతం ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. అందుకే అక్కడ కూడా ప్రధాని పదవికి పోటీ చేయవచ్చని చమత్కరించారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చాలా మంచివారని కితాబిచ్చారు.

ఏం కోరుకుంటే అది చేస్తారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో నెతన్యాహూను సరిగ్గా ట్రీట్ చేయడం లేదని వాపోయారు. ఇరాన్‌తో యుద్దం నేపథ్యంలో ఒప్పందం అంశంపై కూడా ఆయన స్పందించారు. యుద్ధంపై ఇరాన్‌తో ఒప్పందానికి వచ్చే విషయంలో ఎలాంటి తొందరపాటు లేదని స్పష్టం చేశారు. ఒప్పందం కుదరకుంటే త్వరలో ఇరాన్‌పై విరుచుకుపడతామని ట్రంప్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే.

Donald Trump
Israel
Benjamin Netanyahu
US President
Israeli Prime Minister
Iran
Iran Nuclear Deal
Politics
Elections
Popularity

More Telugu News